ETV Bharat / bharat

'పునరుత్పాదక రంగానికి ప్రోత్సాహకాలు'

పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్​ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు అందివ్వనున్నట్టు మోదీ తెలిపారు. పునరుత్పాదక శక్తిలో భారత్​ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్టు వెల్లడించారు. రీ-ఇన్వెస్ట్​ 2020 సమావేశంలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

author img

By

Published : Nov 26, 2020, 7:22 PM IST

PM Narendra Modi at inauguration of 3rd Global Renewable Energy Investment Meeting and Expo
'పునరుత్పాదక శక్తిలో భారత్​ వేగంగా అభివృద్ధి'

పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్​ను ఉత్పత్తి చేసేందుకు.. అధిక సామర్థ్యం గల సోలార్​ మాడ్యూల్స్​కు పీఎల్​ఐ (ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు) ఇవ్వనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ప్రోత్సాహకాలు.. ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల పీఎల్​ఐతో పోలి ఉంటాయన్నారు.

"రీ-ఇన్వెస్ట్​ 2020" సమావేశంలో వర్చువల్​గా పాల్గొన్న ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్​లో పునరుత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ వ్యాపారుల్ని కోరారు.

"ప్రస్తుతం పునరుత్పాదక శక్తిలో దేశం 4వ స్థానంలో ఉంది. భారత దేశ పునరుత్పాదక శక్తిసామర్థ్యాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గత ఆరేళ్లలో దేశ సామర్థ్యం రెండున్నర రెట్లు పెరిగింది. ఏటా ఈ రంగంలో 20బిలియన్​ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్​ మ్యానుఫ్యాక్చరింగ్​లో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు అందించినట్టుగానే ఇందులోనూ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నాం."

---- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ప్రతికూల సమయంలోనూ పునురుత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టినట్టు మోదీ వెల్లడించారు. పర్యావరణ హిత విధానాలు.. ఆర్థిక విధానాలుగానూ ఉపయోగపడతాయని ప్రపంచానికి భారత్​ చాటిచెబుతున్నట్టు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:- టీకాపై శనివారం మోదీ కీలక ప్రకటన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.