మార్చిలోగా 17 రఫేల్ యుద్ధవిమానాలను దేశం కలిగి ఉంటుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. 2022 ఏప్రిల్ నాటికి.. కొనుగోలు చేసిన అన్ని రఫేల్ జెట్లు దేశానికి వస్తాయని చెప్పారు. రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమధానం ఇచ్చారు.
కొత్త విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి ప్రవేశపెట్టే ముందు వేడుక నిర్వహిస్తామని రాజ్‌నాథ్ ప్రకటించారు.
రూ.59,000 కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు 2016లో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది భారత్.
ఆయుధ సామగ్రి కొనుగోలుకు ఆమోదం..
తూర్పు లద్ధాఖ్‌లో ప్రతిష్టంభనల నేపథ్యంలో సాయుధ బలగాలకు అవసరమైన ఆయుధ సామగ్రిని తక్షణం కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భూభాగ, వాతావరణానికి సంబంధించిన సామగ్రిని సాయుధ బలగాలకు సమకూర్చనున్నట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ వెల్లడించారు. సాయుధ బలగాల కుటుంబాలకు ఎలాంటి ప్రత్యేక వెసులుబాట్లను కల్పించట్లేదని తెలిపారు. సైనికులకు అందించే ఆహార నాణ్యతపై ఎలాంటి ఫిర్యాదులు ఇప్పటివరకు రాలేదని విపక్షాలకు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.