ETV Bharat / bharat

ట్రూడో వ్యాఖ్యలపై కెనడా హైకమిషనర్​కు సమన్లు​ - జస్టిన్​ ట్రూడో

దిల్లీలో జరుగుతోన్న రైతుల నిరసనలపై కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో, ఇతర నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆ దేశ హైకమిషనర్​కు సమన్లు జారీ చేసింది భారత్​. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేసింది.

India summons Canadian High Commissioner
కెనడా హైకమిషన్​కు సమన్లు​
author img

By

Published : Dec 4, 2020, 2:56 PM IST

Updated : Dec 4, 2020, 3:23 PM IST

దేశంలో జరుగుతోన్న రైతుల ఆందోళనలపై కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో, ఇతర నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించింది భారత్​. ఈ మేరకు ఆ దేశ హైకమిషనర్​కు సమన్లు జారీ చేసింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేసింది భారత విదేశాంగ శాఖ. అలాంటి చర్యలు కొనసాగితే.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది.

" ఈరోజు కెనడా హైకమిషనర్​కు సమన్లు జారీ చేశాం. భారతీయ రైతులకు సంబంధించిన సమస్యలపై కెనడా ప్రధాని, కొందరు కేబినెట్​ మంత్రులు, పార్లమెంట్​ సభ్యులు చేసిన వ్యాఖ్యలు ఆమోద యోగ్యం కాదని తెలియజేశాం. కెనడా నాయకులు చేసిన వ్యాఖ్యలు.. అక్కడి భారత హైకమిషన్​, కాన్సులేట్​ ముందు ఉగ్రవాద కార్యకలాపాలకు దారితీసే ప్రమాదం ఉంది. దాంతో భద్రత సమస్యలు తలెత్తుతాయి. భారతీయ హైకమిషన్​ అధికారులకు కెనడా ప్రభుత్వం పూర్తిస్థాయి భద్రత కల్పిస్తుందని భావిస్తున్నాం. ఉగ్రకార్యకలాపాలను రెచ్చగొట్టే చర్యలకు వారి రాజకీయ నేతలు దూరంగా ఉండాలి."

- భారత విదేశాంగ శాఖ.

భారత్​లో జరుగుతోన్న రైతుల ఆందోళనలకు కెనడా ప్రధాని ట్రూడో మద్దతు ప్రకటించారు. శాంతియుత నిరసనలకు కెనడా ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలిపారు. అలాగే.. భారత్​లో తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనలపై ఆ దేశ రక్షణ మంత్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి వ్యాఖ్యలను ఖండించింది భారత్​.

ఇదీ చూడండి: కర్తార్‌పూర్‌ అంశంపై పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు

Last Updated : Dec 4, 2020, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.