ETV Bharat / bharat

మధ్య శ్రేణి క్షిపణి ప్రయోగం విజయవంతం

author img

By

Published : Dec 23, 2020, 7:06 PM IST

ఒడిశా తీరంలో మరో మధ్యంతర క్షిపణి ప్రయోగం విజయవంతమైందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. ఇది సుదూర ప్రాంతంలోని లక్ష్యాలను చేధించగలదని తెలిపాయి. దీనిని ఇజ్రాయెల్​ ఏరోస్పేస్​ సంస్థ, డీఆర్​డీఓలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

India successfully test-fires medium range surface-to air missile off Odisha coast
మధ్య శ్రేణి క్షిపణి ప్రయోగం విజయవంతం

భూమి నుంచి గాలిలోని లక్ష్యాలను చేధించే మధ్య శ్రేణి క్షిపణిని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ)విజయంతంగా పరీక్షించింది. భారత సైన్యం అవసరాల కోసం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఏజెన్సీతో కలిసి ఈ క్షిపణిని డీఆర్​డీఓ అభివృద్ధి చేస్తోంది. ఒడిశా బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌ నుంచి మొబైల్ లాంఛర్ ద్వారా మధ్యశ్రేణి క్షిపణిని ప్రయోగించారు.

ముందుగా 'బాన్‌షీ' పేరుతో ఉండే మానవ రహిత విమానాన్ని గాల్లోకి పంపించారు. తర్వాత మధ్యతరహా క్షిపణి బాన్‌షీని కచ్చితత్వంతో చేధించిందని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మధ్యశ్రేణి క్షిపణిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తయారుచేస్తోంది.

ఈ క్షిపణిని సైన్యంలో చేర్చితే రక్షణ బలగాల పోరాట సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.