అఫ్గానిస్థాన్‌పై తాలిబన్లు ఆధిపత్యం సాధించక ముందే భారత్ వారిని అధికారికంగా గుర్తించి ఉంటే బాగుండేదని విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి కె.నట్వర్ సింగ్(92) అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి మనకు ఉత్తమమని, బాధ్యతాయుత పాలకులుగా తాలిబన్లు నిరూపించుకుంటే అఫ్గాన్‌తో దౌత్యపరమైన సంబంధాలు పెట్టుకోవచ్చని తెలిపారు. అయినా 20 ఏళ్ల కిందట అధికారంలో ఉన్నప్పటికీ, ఇప్పటికీ తాలిబన్ల వైఖరిలో గణనీయమైన మార్పు కనిపిస్తోందన్నారు.
యూపీఏ-1 హయాంలో విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా పనిచేసిన నట్వర్ సింగ్ పాకిస్థాన్‌కు భారత రాయబారిగా కూడా వ్యవహరించారు. దౌత్య వ్యవహారాలపరంగా విశేషానుభవం ఉన్న ఈ సీనియర్ నేత అఫ్గాన్ పరిణామాలపై బుధవారం పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'ఒకవేళ నేనే విదేశాంగ మంత్రిగా ఉండి ఉంటే.. నా పరిధులు దాటి, నేను తాలిబన్లతో మాట్లాడేవాడిని' అని నట్వర్ సింగ్ తెలిపారు.
ఇదీ చూడండి: అఫ్గాన్‌పై మోదీ కీలక భేటీ- వారిని తీసుకురావాలని ఆదేశం!
ఇదీ చూడండి: భారత్ కానుక తాలిబన్ల వశం.. పార్కులనూ వదల్లేదు!