ETV Bharat / bharat

రష్యాతో బంధం మరింత బలోపేతం- కుదరనున్న కీలక ఒప్పందాలు!

India Russia: భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం భేటీ కానున్నారు ఈ సందర్భంగా.. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో మరింత సహకారం కోసం ఇరు దేశాలు పరస్పర అవగాహనకు వస్తాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

indo russia relations
రష్యా భారత్
author img

By

Published : Dec 5, 2021, 5:42 AM IST

Updated : Dec 5, 2021, 6:51 AM IST

India Russia: భారత్ రష్యాల బంధం మరింత బలపడేలా సోమవారం ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ రోజున భారత పర్యటనకు రానున్నారు. ఆ దేశంలో కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ దిల్లీ రానుండటం విశేషం.

"డిసెంబర్ 26 పూర్తిగా రష్యా రోజు"గా ఉండనుంది. ఆ రోజంతా పలు స్థాయిల్లో చర్చలు జరగనున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ- పుతిన్​ల శిఖరాగ్ర సదస్సు సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 9.30 గంటల సమయంలో ఆయన తిరుగు ప్రయాణం కానున్నారు.

ముందు రోజైన ఆదివారం రాత్రే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్, రక్షణ మంత్రి సెర్గీ షోయ్​గు దిల్లీ చేరుకోనున్నారు. 2+2 బృందంలో భాగంగా ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు చర్చలు జరుపుతారు. అఫ్గానిస్థాన్, ఉగ్రవాదం సమస్యలు ప్రస్తావనకు రానున్నాయి.

కీలక ఒప్పందాలు..

శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోదీ- పుతిన్​లు ఏకాంతంగా చర్చలు జరపనున్నారు. ఆయన గౌరవార్థం విందు ఇవ్వనున్నారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు కుదరనున్నాయి.

రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో చిరకాల సంబంధాలు ఉన్నాయి. వీటిని మరింత పెంచుకోనున్నారు. ఇందులో భాగంగానే అమేఠీ సమీపంలోని కోర్వాలో రూ.5 వేల కోట్లతో సంయుక్తంగా నెలకొల్పిన కర్మాగారంలో ఏకే-230 రైఫిళ్ల తయారీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. సైన్యం కోసం రెండు ఇంజిన్ల 226టీ తేలికపాటి హెలికాప్టర్లను సంయుక్తంగా తయారు చేయాలని కూడా నిర్ణయించనున్నారు. 200 హెలికాప్టర్ల తయారీపై ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'వారు చేసిన నష్టం పూడ్చేలా దేశవ్యాప్తంగా 'మహాయజ్ఞం''

Last Updated : Dec 5, 2021, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.