దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Coronavirus Live Updates) క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొత్తగా 42,640 మంది వైరస్ బారిన పడ్డారు. గడిచిన 91 రోజుల్లో ఇవే అత్యల్ప రోజువారీ కేసులు కావడం గమనార్హం.
కాగా,మహమ్మారి ధాటికి మరో 1,167 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 81,839 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 2,99,77,861
- మొత్తం మరణాలు: 3,89,302
- కోలుకున్నవారు: 2,89,26,038
- యాక్టివ్ కేసులు: 6,62,521
సోమవారం ఒక్కరోజే 16,64,360 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 39,40,72,142కు చేరింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి : 'టీకా పంపిణీ ప్రక్రియకు వెన్నెముక కొవిన్!'
కరోనాపై పోరులో భాగంగా ఇప్పటివరకు 28 కోట్ల 87లక్షల 66 వేలకు పైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం 86 లక్షల 16 వేల 373 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది.
ఇదీ చదవండి : మరో ఆరు వారాల్లో థర్డ్ వేవ్ అటాక్!