INDIA COVID CASES: భారత్‌లో కరోనా కలవరం కొనసాగుతోంది. స్వల్పంగా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఉదయం శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 3,805 కేసులు నమోదయ్యాయి. మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 3,168 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోలుకున్నవారి శాతం 98.74గా ఉంది. మొత్తం కొవిడ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 0.05 శాతంగా ఉన్నాయి.
- మొత్తం కరోనా కేసులు: 4,30,98,743
- మొత్తం మరణాలు: 5,24,024
- యాక్టివ్ కేసులు: 20,303
- కోలుకున్నవారి సంఖ్య: 4,25,54,416
వ్యాక్సిన్ తీసుకునేందుకు పెద్దఎత్తున జనం ముందుకొస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 17,49,063 మందికి టీకా అందించింది కేంద్రం. మొత్తంగా ఇప్పటివరకు 1,90,00,94,982 డోసుల టీకా పంపిణీ చేసింది. శుక్రవారం 4,87,544 మందికి కరోనా పరీక్షలు చేపట్టింది. ఇప్పటివరకు చేసిన టెస్టుల సంఖ్య 84 కోట్లు దాటింది.
Covid cases around the world: ప్రపంచవ్యాప్తంగా క్రితం రోజుతో పోలిస్తే కొవిడ్ కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 4,97,045 మందికి వైరస్ సోకింది. మహమ్మారితో 1,946 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 86,026 కేసులు వెలుగుచూశాయి. 248 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 77,116 కేసులు నమోదయ్యాయి. 291 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలో తాజాగా 38,113 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో కొత్తగా 43,947 కేసులు బయటపడ్డాయి. మహమ్మారితో 125 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 40,224 కేసులు నమోదయ్యాయి. 110 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: కాంచెన్‌జంగా పర్వతం అధిరోహిస్తూ భారతీయుడు దుర్మరణం