దేశంలో కరోనా కేసులు (India covid cases) క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 25 వేల కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 339 మంది మరణించారు. 37,127 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 3,32,89,579
- మొత్తం మరణాలు: 4,43,213
- యాక్టివ్ కేసులు: 3,62,207
- కోలుకున్నవారు: 3,24,84,159
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వ్యాక్సినేషన్
దేశంలో టీకా పంపిణీ (Vaccination in India) రికార్డు వేగంతో కొనసాగుతోంది. మొత్తం 75,22,38,324 డోసులు పంపిణీ చేశారు. సోమవారం 78,66,950 మందికి టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తన పోర్టల్‌లో వెల్లడించింది.
ఇదీ చదవండి: దేశంలో 75 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ
ప్రపంచదేశాల్లో
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,40,782 మందికి నిర్ధరణ అయింది. 6807 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో అత్యధికంగా లక్షకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 815 మంది మరణించారు.
వివిధ దేశాల్లో కొత్త కేసులు ఇలా..
- అమెరికా- 109,432
- బ్రిటన్- 30,825
- టర్కీ- 24,613
- ఇరాన్- 22,541
- ఫిలిప్పీన్స్- 20,745
- రష్యా- 18,178
ఇదీ చదవండి: కశ్మీర్‌పై తీరు మారని దాయాది.. అప్రమత్తతే కీలకం!