దేశంలో రోజువారి కరోనా కేసులు సంఖ్య పెరుగుదల (Coronavirus update) కొనసాగుతోంది. కొత్తగా 16,156 కరోనా కేసులు (Coronavirus update) నమోదయ్యాయి. వైరస్ ధాటికి (Covid cases in India) మరో 733 మంది ప్రాణాలు కోల్పోగా.. 17,095 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 3,42,31,809
- మొత్తం మరణాలు: 4,56,386
- మొత్తం కోలుకున్నవారు: 3,36,14,434
- యాక్టివ్ కేసులు: 1,60,989
పరీక్షలు
దేశవ్యాప్తంగా బుధవారం 12,90,900 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య 60,44,98,405కు చేరినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
టీకా పంపిణీ
టీకా పంపిణీకొత్తగా 49,09,254 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,04,04,99,873 కి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు..
ప్రపంచవ్యాప్తంగా (coronavirus worldwide) కొత్తగా 4,26,091 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ ధాటికి మరో 7,535 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,52,58,558 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,78,251కు పెరిగింది.
- అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 76,361 మందికి వైరస్ సోకగా.. మరో 1,584 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో కొత్తగా 36,582 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజే 1,123 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లో కొత్తగా 43,941 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 207 మంది మృతి చెందారు.
- టర్కీలో కొత్తగా 26,896 మంది వైరస్ బారిన పడగా.. 210 మంది మరణించారు.
- జర్మనీలో కొత్తగా మరో 26,099 మందికి కొవిడ్ సోకింది. 146 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి : కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్ కలకలం- ఏడుగురికి పాజిటివ్