ETV Bharat / bharat

India covid cases: దేశంలో మరో 10 వేల కేసులు.. 330 మరణాలు

author img

By

Published : Nov 9, 2021, 9:40 AM IST

Updated : Nov 9, 2021, 10:09 AM IST

భారత్​లో కరోనా కేసులు (India covid cases) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 10,126 మందికి కరోనా (Corona cases in India) సోకింది. వైరస్​ ధాటికి మరో 332 మంది మరణించారు.

india corona cases
ఇండియా కరోనా కేసులు

దేశం​లో కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా తగ్గింది. తాజాగా 10,126 మందికి కొవిడ్​ పాజిటివ్​గా(Corona cases in India) తేలింది. కరోనా​ ధాటికి మరో 332 మంది మృతి చెందారు. ఒక్క కేరళలోనే 266 మంది కరోనా రోగులు మరణించారు. దేశంలో కరోనా కేసులు 266 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. అటు రికవరీ రేటు 98.25 కాగా మరణాల రేటు 1.34గా ఉంది.

  • మొత్తం కేసులు: 3,43,77,113
  • మొత్తం మరణాలు: 4,61,389
  • యాక్టివ్​ కేసులు: 1,40,638
  • కోలుకున్నవారు:3,37,75,086

టీకాల పంపిణీ​..

దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 59,08,440 డోసుల వ్యాక్సిన్​ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,09,08,16,356కి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా​ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 3,66,656 మందికి కొవిడ్​​ (Corona update) సోకింది. కరోనా​ ధాటికి 5,480 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,10,27,406 కు చేరింది. మొత్తం మరణాలు 50,70,865కి చేరాయి.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికాలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. 50,418 మందికి వైరస్​ సోకింది. మరో 449 మంది చనిపోయారు.
  • రష్యాలో మరో 39,400 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజే 1,190 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో కొత్తగా 32,322 మందికి వైరస్​​ బారినపడ్డారు. మరో 57 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 27,824 కరోనా​ కేసులు నమోదవగా.. 187 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో కొత్తగా మరో 20,580 మందికి కొవిడ్ సోకింది. 108 మంది మరణించారు.

ఇదీ చదవండి:NCRB Report 2021: కరోనా వేళ.. వ్యాపారుల ఆత్మహత్యలే ఎక్కువ!

Last Updated : Nov 9, 2021, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.