దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కొత్తగా 3,14,835 మందికి వైరస్ సోకింది. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా రోజువారీ కేసులు నమోదైన దేశంగా రికార్డు సృష్టించింది భారత్. మరో 2,104 మంది చనిపోయారు. 1,78,841 మంది కొవిడ్‌ను జయించారు.
మొత్తం కేసులు: 1,59,30,965
మొత్తం మరణాలు: 1,84,657
మొత్తం కోలుకున్నవారు: 1,34,54,880
యాక్టివ్ కేసులు: 22,91,428
క్రియాశీల కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఫలితంగా యాక్టివ్ కేసులు.. 14.38 శాతానికి పెరిగాయి. రికవరీ రేటు.. 84.46 శాతానికి పడిపోయింది. మరణాల రేటు 1.16గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దేశంలో మొత్తంగా 13 కోట్ల 23 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
కొవిడ్ వ్యాప్తి కట్టడిలో భాగంగా బుధవారం ఒక్కరోజే 16,51,711 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్ టెస్ట్‌ల సంఖ్య 27 కోట్ల 27 లక్షలు దాటింది.
ఇదీ చూడండి: సీతారాం ఏచూరి తనయుడు కరోనాతో మృతి