ETV Bharat / bharat

ఆ వివరాలు ఇచ్చిపుచ్చుకున్న భారత్-పాక్ - భారత ఖైదీలు పాక్

2008లో కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్-పాకిస్థాన్​లు తమ అధీనంలోని ఖైదీల వివరాలను పంచుకున్నాయి. దీని ప్రకారం.. 271 మంది పాక్ పౌరులు, 74 మంది మత్స్యకారులు భారత్​లోని జైళ్లలో ఉంటున్నారు. మరోవైపు, భారత్​కు చెందిన 51 మంది పౌరులు, 558 మంది మత్స్యకారులు పాకిస్థాన్ అధీనంలో ఉన్నారు.

india-pakistan-exchange-list-of-prisoners
భారత్ పాక్
author img

By

Published : Jul 1, 2021, 7:52 PM IST

భారత్, పాకిస్థాన్​లు తమ అధీనంలోని ఖైదీలు, మత్స్యకారుల వివరాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. పాక్​కు చెందిన ఖైదీల వివరాలను భారత్.. దిల్లీలోని దౌత్యకార్యాలయం ద్వారా ఆ దేశ ప్రతినిధులకు అందించింది. అదేవిధంగా అక్కడి జైళ్లలో ఉంటున్న భారతీయుల వివరాలను పాక్ విదేశాంగ శాఖ ఇస్లామాబాద్​లో భారత రాయబారికి అందజేసింది. 2008లో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా జనవరి, జులై ఒకటో తేదీన ఈ జాబితాను ఇరుదేశాలు పంచుకుంటాయి.

విదేశాంగ శాఖ అందించిన వివరాల ప్రకారం.. 271 మంది పాకిస్థాన్ పౌరులు, 74 మంది మత్స్యకారులు భారత్​లోని జైళ్లలో ఉంటున్నారు. పాక్ వివరాల ప్రకారం.. 51 మంది భారత పౌరులు, 558 మంది మత్స్యకారులు ఆ దేశ అధీనంలో ఉన్నారు.

కస్టడీలో ఉన్న భారతీయ పౌరులు, మత్స్యకారులు, అధికారులను వెంటనే విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని పాక్​కు సూచించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. ఓ భారత పౌరుడు సహా 295 మంది మత్స్యకారుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపింది. కరోనా నేపథ్యంలో.. భారత పౌరులు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.