ఉగ్రవాదం, అధికార దాహార్తి, ఆర్థిక నేరాలను ఎదురుక్కోవడంలో జీ-7 దేశాలకు భారత్ సహకారం కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీ7 కూటమికి భారత్ సహజ భాగస్వామి అని వ్యాఖ్యానించారు.
జీ-7 శిఖరాగ్ర సమావేశంలో నిర్వహించిన 'ఓపెన్ సొసైటీస్- ఓపెన్ ఎకానమీస్' అనే అంశంపై మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రజాస్వామ్యం, ఆలోచనా స్వేచ్ఛ పట్ల భారతదేశ నాగరికతకు ఉన్న నిబద్ధతను వివరించారు.
భారత్‌లో ఆధార్, ప్రత్యక్ష నగదు బదిలీ విధానం, జన్‌ధన్-ఆధార్-మొబైల్ వంటి అప్లికేషన్స్‌తో దేశంలో వచ్చిన మార్పును జీ-7 దేశాలకు వివరించారు.