ETV Bharat / bharat

'భారత్​లో 13% తగ్గిన కరోనా కేసులు.. కానీ..'

author img

By

Published : May 19, 2021, 2:45 PM IST

భారత్​లో అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం కొత్త కేసుల సంఖ్య 13 శాతం తగ్గిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసుల్లో భారత్​ అగ్రస్థానంలో ఉందని తెలిపింది.

WHO on india corona cases, భారత్​లో కరోనా కేసులు
భారత్​లో కరోనా కేసులు

భారత్​లో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం 13 శాతం తగ్గిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్​ ఇంకా తొలి స్థానంలోనే కొనసాగుతోందని తెలిపింది. గత వారం ప్రపంచవ్యాప్తంగా 48 లక్షల కేసులు, 86 వేల మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. అంతకుముందు వారంతో పోలిస్తే మరణాలు 5 శాతం, కొత్త కేసులు 12 శాతం తగ్గుముఖం పట్టాయని వివరించింది. మే16 నాటికి అందిన సమాచారం మేరకు డబ్ల్యూహెచ్​ఓ ఈ ప్రకటన చేసింది.

తగ్గని వైరస్​ ప్రభావం

భారత్​లో గత వారం 23.87 లక్షల కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అంతకుముందు వారం 27.38 కేసులు నమోదయ్యాయి.

మరణాలు కూడా భారత్​లోనే అత్యధికంగా నమోదయ్యాయి. వైరస్​ కారణంగా గత వారం 27,922 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది అంతకుముందు వారం కన్నా నాలుగు శాతం ఎక్కువ.

అమెరికాలో కొత్తగా నమోదయ్యే కేసులు తగ్గుముఖం పట్టాయి. గత వారం 2.35 లక్షల కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంతో పోలిస్తే ఈ సంఖ్య 21 శాతం తక్కువ. కరోనా మరణాలు ఇండోనేషియాలో గత వారం 5శాతం తగ్గాయి. కేవలం 1,125 మరణాలే నమోదయ్యాయి.

ఇప్పటివరకు భారత్​లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2.4 కోట్లు కాగా.. మృతిచెందిన వారి సంఖ్య 2.70 లక్షలని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది.

ఇదీ చదవండి : కరోనాపై పోరులో అమరులైన 700 మంది టీచర్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.