bharat israel relations : భారత్, ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకోసం ఇదే సరైన సమయమని తెలిపారు. ఇరుదేశాల మధ్య పూర్తిస్థాయిలో దౌత్య సంబంధాలు ప్రారంభమై 30ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఇరుదేశాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభమైందన్న ప్రధాని.. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, ఇజ్రాయెల్ సంబంధాల ప్రాముఖ్యత మరింత పెరిగిందని అన్నారు. భారత్‌లో యూదు సమాజం శతాబ్దాలుగా ఎటువంటి వివక్ష లేకుండా సామరస్య వాతావరణంలో అభివృద్ధి చెందుతోందని ప్రధాని గుర్తుచేశారు. ఇరుదేశాల ప్రజలు ఎప్పటికీ ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉంటారని పేర్కొన్నారు. ఈ ఏడాదికి భారత్ స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తవుతుండగా వచ్చే ఏడాది ఇజ్రాయెల్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కానున్నాయి.
ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకు నేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదని ప్రధాని అన్నారు. భారత్ 1950 లోనే ఇజ్రాయెల్‌ను గుర్తించినప్పటికీ ఇరుదేశాల మధ్య పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు జనవరి 1992 జనవరి 29న ప్రారంభమయ్యాయి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: 'కొవిడ్ కేసులు తగ్గుతున్నా.. అప్రమత్తంగానే ఉండాలి'