ETV Bharat / bharat

'పాక్​తో మైత్రి పెంచుకునేందుకే భారత్​ కృషి'

పాకిస్థాన్​తో మైత్రి పెంచుకునేందుకే భారత్ కృషి చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్-పాక్ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

India desires normal neighbourly ties with Pak says MEA
'పాక్​తో మైత్రి పెంచుకునేందుకే భారత్​ కృషి చేస్తుంది'
author img

By

Published : Feb 25, 2021, 9:15 PM IST

సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలన్న భారత్​-పాక్​ తాజా నిర్ణయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్​తో స్వేహపూర్వకంగా ఉండాలని భారత్​ ఆశిస్తుందని, శాంతియుతంగా చర్చలు జరిపి అన్ని సమస్యలు పరిష్కరించుకునేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.

"పాక్​తో సత్సంబంధాలు పెంచుకునేందుకు భారత్​కు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను శాంతియుతంగా, ద్వైపాక్షికంగా చర్చించుకునేందుకు భారత్​ కృషి చేస్తుంది."

-అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ ప్రతినిధి.

ఇరు దేశాల సైన్యాల డైరెక్టర్​ జనరళ్ల స్థాయి చర్చల అనంతరం భారత్​-పాక్​ ఏకాభిప్రాయానికి వచ్చాయి. గురువారం అర్ధరాత్రి నుంచి కాల్పుల విరమణ ఒప్పందాలకు తూచా తప్పకుండా కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. ఈ నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ప్రతినిధి వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి:ముకేశ్​ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.