ETV Bharat / bharat

భారత్​లో మళ్లీ తగ్గిన కరోనా కేసులు.. అమెరికా, బ్రెజిల్​లో ఉగ్రరూపం - corona cases india

India Covid cases: దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. ఒక్కరోజే 6,594 మందికి వైరస్​ సోకింది. యాక్టివ్​ కేసులు 50 వేలపైనే ఉన్నాయి. కొవిడ్​తో మరో ఆరుగురు చనిపోయారు.

India Covid Cases
India Covid Cases
author img

By

Published : Jun 14, 2022, 9:58 AM IST

Updated : Jun 14, 2022, 10:34 AM IST

India Covid Cases: భారత్​లో కొవిడ్​ కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 8,084 మంది వైరస్​ బారిన పడ్డారు. వైరస్​తో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం 4,035 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.67 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.12 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.32 శాతం వద్ద ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,32,36,695
  • మొత్తం మరణాలు: 5,24,777
  • యాక్టివ్​ కేసులు: 50,548
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,57,335

Vaccination India: భారత్​లో సోమవారం 14,65,182 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 195,35,70,360 కోట్లకు చేరింది. మరో 3,21,873 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 3 లక్షల 30 వేలమందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మరో 724 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 540,953,523కు చేరింది. మరణాల సంఖ్య 63,32,387కు చేరింది. ఒక్కరోజే 4,84,103 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 516,183,780గా ఉంది.

  • అమెరికాలో సోమవారం సుమారు 50 వేల కేసులు వెలుగుచూశాయి. మరో 100 మందికిపైగా చనిపోయారు.
  • తైవాన్​లో మరో 45 వేల కేసులు, 100కుపైగా మరణాలు నమోదయ్యాయి.
  • బ్రెజిల్​లో 40 వేల కరోనా కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి.
  • జర్మనీలో ఒక్కరోజే 38 వేలకుపైగా కొవిడ్​ బారినపడ్డారు. మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి: నీటి గుంతలో పడిన స్కార్పియో.. 8 మంది దుర్మరణం

కోడికూర వండలేదని.. భార్యను నరికి చంపిన భర్త

Last Updated : Jun 14, 2022, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.