India Corona cases: దేశంలో రోజువారీ కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 1,79,723 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా వల్ల మరో 146మంది మృతి చెందారు. 46,569 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 3,57,07,727
- మొత్తం మరణాలు: 4,83,936
- యాక్టివ్ కేసులు: 7,23,619
- మొత్తం కోలుకున్నవారు: 3,45,00172
ఒమిక్రాన్ వ్యాప్తి..
Omicron Cases In India: దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Vaccination in India
దేశంలో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 29,60,975 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,51,94,05,951కు చేరింది.
ప్రపంచ వ్యాప్తంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 1,856,698 మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,78,83,849 దాటింది. మరో 3,318 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 55,05,854కి చేరింది.
- అమెరికాలో తాజాగా 3,08,616 మందికి కరోనా సోకింది. మరో 308 మంది మరణించారు.
- ఫ్రాన్స్‌లో కొవిడ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా 2,96,097 కరోనా కేసులు నమోదయ్యాయి. 90 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 1,41,472 కేసులు వెలుగుచూశాయి. 97మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో తాజాగా 1,55,659 మంది కరోనా సోకింది. 157 చనిపోయారు.
- ఆస్ట్రేలియాలో కొత్తగా 1,00,571 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 23 మంది చనిపోయారు.
- అర్జెంటీనాలో ఒక్కరోజే 73,319 కేసులు వెలుగుచాశాయి. 27 మంది చనిపోయారు.
- టర్కీలో కొత్తగా 61,727 కేసులు నమోదయ్యాయి. 141 మంది వైరస్ ధాటికి మృతి చెందారు.