India covid cases: దేశంలో కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 795 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 58 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 0.17 శాతానికి పడిపోయింది. వీక్లీ పాజిటివ్ రేటు 0.22 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 12,054కు చేరిందని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది. ఇవి మొత్తం కేసుల్లో 0.03 శాతమని తెలిపింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని వెల్లడించింది. 1,280 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
• మొత్తం కేసులు: 4,30,29,839
• యాక్టివ్ కేసులు: 12,054
• రికవరీలు: 4,24,96,369
• మొత్తం మరణాలు: 5,21,416
• కరోనా టెస్టులు: సోమవారం దేశవ్యాప్తంగా 4,66,332 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య 79.15 కోట్లకు చేరిందని స్పష్టం చేసింది.
• Vaccination in India: మరోవైపు, దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. సోమవారం 16,17,668 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 185.53 కోట్లకు చేరింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 15.70 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చదవండి: మంటల్లో సాహసం.. పసిబిడ్డతో పరిగెత్తిన కానిస్టేబుల్