భారత్లో కొవిడ్ కేసుల సంఖ్య (Corona cases in India) స్వల్పంగా పెరిగింది. కొత్తగా 43,263 మంది వైరస్(Corona Update) బారినపడ్డారు. మరో 338 మంది మరణించారు. ఒక్కరోజే 40,567 మంది కరోనాను జయించారు.
- మొత్తం కేసులు: 3,31,39,981
- మొత్తం మరణాలు: 4,41,749
- మొత్తం కోలుకున్నవారు: 3,23,04,618
- యాక్టివ్ కేసులు: 3,93,614
వ్యాక్సినేషన్
బుధవారం ఒక్కరోజే 86,51,701 కొవిడ్ టీకా (Vaccination in India) డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ(Health Ministry) పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 71,65,97,428 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.
ప్రపంచ దేశాల్లో..
ప్రపంచవ్యాప్తంగా కరోనా(Global corona virus update) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 5,98,952 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 9,754 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 223,381,096కు చేరగా.. మరణాల సంఖ్య 4,608,897కు పెరిగింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కొత్త కేసులు ఇలా..
- అమెరికా - 157,759
- బ్రెజిల్- 14,430
- రష్యా- 18,024
- బ్రిటన్- 38,975
- ఫ్రాన్స్- 18,856
- టర్కీ-23,914
- ఇరాన్-26,854
- మెక్సికో-15,784