ETV Bharat / bharat

కరోనా కలవరం.. భారీగా పెరిగిన కేసులు.. మరో 17వేల మందికి వైరస్​ - వ్యాక్సినేషన్​ రేటు

Covid cases in india: భారత్​లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. ఒక్కరోజే 17,336 మందికి వైరస్​ సోకింది. మరో 13 మంది చనిపోయారు. 13,029 మంది కోలుకున్నారు.

corona cases
corona cases
author img

By

Published : Jun 24, 2022, 9:23 AM IST

Covid Cases in India: దేశంలో మరోసారి కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం వరకు ఒక్కరోజే 17,336 మంది వైరస్​ బారినపడగా.. మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 13,029 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.60 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.19 శాతం వద్ద ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 43,362,294
  • మొత్తం మరణాలు: 5,24,954
  • యాక్టివ్​ కేసులు: 88,284
  • కోలుకున్నవారి సంఖ్య: 4,27,49,056

Vaccination India: భారత్​లో గురువారం 13,71,107 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,77,33,217 కోట్లకు చేరింది. మరో 4,01,649 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 7,25,222 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,650 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 547,326,664కు చేరింది. మరణాల సంఖ్య 6,347,476కు చేరింది. ఒక్కరోజే 463,579 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 522,639,042గా ఉంది.

  • జర్మనీలో ఒక్కరోజే 119,360కొత్త కేసులు బయటపడగా.. 98 మంది మరణించారు.
  • అమెరికాలో 96,702 కేసులు వెలుగుచూశాయి. 266 మందికిపైగా చనిపోయారు.
  • ఫ్రాన్స్​లో 79,582 కొత్త కేసులు నమోదుకాగా.. 40 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 69,23 కేసులు నమోదు కాగా.. 346 మంది మరణించారు.
  • ఇటలీ ఒక్కరోజే 56,166 మంది కొవిడ్​ బారినపడగా..75 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి: లోయలో పడిన బస్సు.. ఐదుగురు మృతి.. 47 మందికి గాయాలు

మాతృభక్తి.. తల్లి మాట తప్ప ఎవరి ఆదేశాలను లెక్కచేయని వీరుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.