India Covid Cases: దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 7,240 మంది వైరస్ బారినపడ్డట్లు తేలింది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 3,591 మంది కోలుకున్నారు.. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.71 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.08 శాతం వద్ద ఉంది.
- మొత్తం కరోనా కేసులు:4,31,90,282
- మొత్తం మరణాలు: 5,24,723
- యాక్టివ్ కేసులు: 32,498
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,40,301
Vaccination India: భారత్లో బుధవారం 15,43,748 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,59,81,691కు చేరింది. మరో 3,40,615 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు ఒక్కరోజే 5,91,610 కేసులు వెలుగుచూశాయి. మరో 1,649 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 53,80,10,527కు చేరింది. మరణాల సంఖ్య 63,26,416కు చేరింది. ఒక్కరోజే 5,03,412 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 50,93,52,180గా ఉంది.
- అమెరికాలో 96848 కొత్త కేసులు, 339 మరణాలు వెలుగుచూశాయి.
- తైవాన్లో 83,223 కొవిడ్ కేసులు, 159 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో 49,614 మంది వైరస్ బారిన పడ్డారు. 301 మంది చనిపోయారు.
- జర్మనీలో 42వేలు, ఉత్తర కొరియాలో మరో 54వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి: కొత్త వేరియంట్ వల్లే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయా?