India Corona cases: దేశంలో రోజువారీ కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 1,59,632 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా వల్ల మరో 327మంది మృతి చెందారు. 40,863 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కొవిడ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 3,55,28,004
- మొత్తం మరణాలు: ,83,790
- యాక్టివ్ కేసులు: 5,90,611
- మొత్తం కోలుకున్నవారు: 3,44,53,603
ఒమిక్రాన్ వ్యాప్తి..
Omicron Cases In India: దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,0623కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 1,409 మంది కోలుకున్నట్లు తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్ర 1,009 ఒమిక్రాన్ కేసులతో తొలి స్థానంలో ఉంది. 513 మంది ఒమిక్రాన్ బాధితులతో దిల్లీ తర్వాత స్థానంలో ఉంది.
Vaccination in India
దేశంలో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 89,28,316 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,51,57,60,645కు చేరింది.
ప్రపంచ వ్యాప్తంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. శనివారం ఒక్కరోజే 22,05,864 మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 30 కోట్ల 60లక్షలు దాటింది. మరో 4,821 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 55,02,339కి చేరింది.
- అమెరికాలో తాజాగా 4,68,081 మందికి కరోనా సోకింది. మరో 669 మంది మరణించారు.
- ఫ్రాన్స్‌లో కొవిడ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా 3,03,669 కరోనా కేసులు నమోదయ్యాయి. 142 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 1,46,390 కేసులు వెలుగుచూశాయి.313 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో తాజాగా 1,97,552 మంది కరోనా సోకింది. 184 చనిపోయారు.
- ఆస్ట్రేలియాలో కొత్తగా 1,15,507 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 25 మంది చనిపోయారు.
- అర్జెంటీనాలో ఒక్కరోజే 1,01,689 కేసులు వెలుగుచాశాయి.37 మంది చనిపోయారు.
- టర్కీలో కొత్తగా 68,237 కేసులు నమోదయ్యాయి. 141 మంది వైరస్ ధాటికి మృతి చెందారు.
ఇదీ చదవండి: ముంబయిలో విజృంభిస్తున్న కరోనా.. మహారాష్ట్రలో 40 వేల కేసులు