దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 2,81,386 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 4,106 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 2,49,65,463
- మొత్తం మరణాలు: 2,74,390
- కోలుకున్నవారు: 2,11,74,076
- యాక్టివ్ కేసులు: 35,16,997
ఆదివారం 15,73,515 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 31,64,23,658కి చేరినట్లు వెల్లడించింది.
కరోనాపై పోరులో భాగంగా ఇప్పటివరకు 18.29 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం 6.9 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: 'ఎన్నికల ప్రచారం వల్లే బంగాల్లో అధిక కేసులు'
ఇదీ చూడండి: కరోనాలో కొత్త లక్షణం.. 'కొవిడ్ టంగ్'