లద్దాఖ్‌లోని గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్, దెప్సాంగ్ మైదానాల్లో ప్రతిష్టంభణకు తెరదించేందుకు భారత్, చైనా మరోసారి భేటీ కానున్నాయి. కార్ప్స్ కమాండర్ స్థాయిలో ఏప్రిల్ 9న ఈ చర్చలు జరిగే అవకాశముందని ఆర్మీ అధికారులు తెలిపారు.
పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో గోగ్రా పర్వతాలు, దెప్సాంగ్లలోనూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఇరు దేశాలు దౌత్య స్థాయి చర్చలు జరిపిన వెంటనే ఈ భేటీ జరిగే అవకాశం ఉంది.
ఏడాది కాలంగా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన.. సైనిక, రాజకీయ స్థాయిల్లో సమగ్ర చర్చల ద్వారా కొలిక్కి వస్తోంది. ఇప్పటివరకు ఇరు దేశాలు మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయిలో పది సార్లు భేటీ కాగా.. పాంగాంగ్ సరస్సు నుంచి బలగాల ఉపసంహరణ గత నెలలోనే పూర్తయింది.
ఇదీ చూడండి: 2వేల మంది పోలీసులు మాపై దాడి: మావోయిస్టులు