ETV Bharat / bharat

'NDA మూడోసారి అధికారంలోకి వస్తే.. మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్' - భారత ఆర్థిక వ్యవస్థపై మోదీ వ్యాఖ్యలు

Modi Inaugurated IECC In Delhi : ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్​డీఏ కూటమి మూడో అధికారంలోకి రావాలన్నారు. 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్​ను తయారుచేయడమే ఎన్​డీఏ లక్ష్యమన్నారు. బుధవారం దిల్లీలో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (IECC) కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మోదీ.. అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

modi-inaugurated-international-exhibition-cum-convention-centre-in-delhi

author img

By

Published : Jul 26, 2023, 8:33 PM IST

Updated : Jul 26, 2023, 10:27 PM IST

Modi Inaugurated IECC In Delhi : బీజేపీ సారథ్యంలోని ఎన్​డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తే.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వృద్ధిరేటు సైతం మరింత పెరుగుతుందన్నారు. రానున్న 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్​ను తయారుచేయడమే తమ లక్ష్యమని మోదీ వెల్లడించారు. భారత్​ ప్రజాస్వామ్యానికి మాతృక అనే విషయాన్ని ప్రపంచం అంగీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. బుధవారం దిల్లీలో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (IECC) కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మోదీ అనంతరం మాట్లాడారు. ఐఈసీసీకి 'భారత్ మండపం' అని నామకరణం చేశారు.

భారత్​ కచ్చితంగా పేదరికాన్ని రూపుమాపగలదని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. 13.5 కోట్ల భారతీయులు పేదరికం నుంచి బయటపడినట్లు.. నీతి ఆయోగ్​ ఇచ్చిన నివేదిక ఆయన ప్రస్తావించారు. తమ తొమ్మిదేళ్ల హయాంలో విమానాశ్రయాల సంఖ్య, రైల్వే లైన్ విద్యుదీకరణ భారీగా పెరిగిందన్నారు. 2014లో బీజేపీ అధికారం చేపట్టినప్పుడు ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​ ఉండేదన్న ప్రధాని.. ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు.

  • #WATCH | After seeing 'Bharat Mandapam' every Indian is happy, full of pride, says PM Narendra Modi at the inauguration of IECC Complex in Pragati Maidan, Delhi pic.twitter.com/9HRc3EEOHd

    — ANI (@ANI) July 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

2014లో 70 ఎయిర్​పోర్టులు ఉండగా.. 2023 నాటికి దాదాపు 150కి పెరిగినట్లు మోదీ తెలిపారు. 70 ఏళ్లలో 20వేల కిలోమీటర్ల రైల్వే లైన్​లను విద్యుదీకరిస్తే.. 9 ఏళ్లలో 40వేల కిలోమీటర్లు విద్యుదీకరించామని వెల్లడించారు. మౌలిక సదుపాయల కోసం దాదాపు రూ.34 లక్షల కోట్లను 9 ఏళ్లలో ఖర్చు చేసినట్లు మోదీ వివరించారు. విమానంలో ప్రయాణించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. సెప్టెంబర్​లో భారత్​ అధ్యక్షతన జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు 'భారత్ మండపం' వేదిక అవుతుందన్నారు. అప్పుడు భారత్​ స్థాయిని ప్రపంచమంతా చూస్తుందన్నారు. కొంత మంది ప్రతికూల ఆలోచనలతో అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మోదీ మండిపడ్డారు.

భారత్​ మండపాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వపడతాడని, ఆనందాన్ని వ్యక్తం చేస్తారని మోదీ వ్యాఖ్యానించారు. ఇది భారత ప్రజాస్వామ్యానికి అందమైన బహుమతి అని ఆయన అభిప్రాయపడ్డారు. పీఎం​ గతిశక్తి జాతీయ ప్రణాళిక.. భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా ఉండబోతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం దిల్లీలో నిర్మాణం అవుతుందని మోదీ తెలిపారు.

Last Updated : Jul 26, 2023, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.