ETV Bharat / bharat

భారత్​ @కోటి డోసులు..  11 రోజుల్లో మూడోసారి.. - భారత్​లో కేసులు

vaccination
భారత్​ @కోటి డోసులు..  11 రోజుల్లో మూడోసారి..
author img

By

Published : Sep 6, 2021, 8:15 PM IST

Updated : Sep 6, 2021, 10:01 PM IST

20:13 September 06

భారత్​ @కోటి డోసులు..  11 రోజుల్లో మూడోసారి..

టీకా పంపిణీలో భారత్ దూసుకెళుతోంది. సోమవారం ఒక్క రోజులో కోటికిపైగా టీకాలను పంపిణీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.11 రోజుల వ్యవధిలో కోటీ డోసులు అందివ్వడం ఇది మూడోసారి కావడం విశేషం. మొత్తం మీద ఇప్పటివరకు 69.68కోట్ల టీకాలు ప్రజలకు ఇచ్చారు.
సోమవారం నాటికి దేశంలో తొలి డోసు పొందిన వారి సంఖ్య 53.29 కోట్లకు చేరగా రెండో డోసులు తీసుకున్న వారి సంఖ్య 16.39 కోట్లకు చేరింది.

కేరళలో తగ్గుతున్న కేసులు!

కేరళలో వరుసగా మూడోరోజు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్తగా 19,688 కరోనా కేసులు నమోదు కాగా 135 మంది వైరస్​ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 28,561 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 16.71 శాతంగా నమోదైంది.

దేశ రాజధానిలో కొత్తగా 32 కరోనా కేసులు నమోదయ్యాయి. 16 మంది కోలుకున్నారు. ఈనెలలో ఇప్పటివరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదు.

ఇతర రాష్ట్రాల్లో..

  • మహారాష్ట్రలో కొత్తగా 3,626 కరోనా కేసులు వెలుగు చూశాయి. 37 మంది ప్రాణాలు కోల్పోగా.. 5988 మంది రోగులు వైరస్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 15 తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
  • తమిళనాడులో కొత్తగా 1,500 కేసులు నమోదయ్యాయి. 1,564 మంది కోలుకోగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో కొత్తగా 973 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. 1,071 మంది వైరస్​ను జయించగా.. 17 మంది మృతిచెందారు.
  • ఒడిశాలో పిల్లల్లో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. పిల్లల్లో వైరస్​ వ్యాప్తి 20 శాతానికి చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా నమోదైన 609 కేసులు 122.. చిన్నారులవే కావడం ఆందోళనకరం. మహమ్మారి ధాటికి మరో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. 763 మంది కోలుకున్నారు.

Last Updated : Sep 6, 2021, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.