ETV Bharat / bharat

భవిష్యత్తుపై భారత్​ నమ్మకం కలిగించింది: జైశంకర్ - జైశంకర్ వార్తలు

కరోనాపై పోరాటంలో భారత్​ గణనీయమైన పురోగతి సాధించిందన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. కొన్ని నెలల కింద టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు మన దేశంలో ఉత్పత్తి కాకపోయినప్పటికీ.. ప్రస్తుతం అవసరానికి మించి తయారు చేయగలుతున్నామని తెలిపారు. ఫలితంగా అనేక దేశాలకు సరఫరా చేసినట్లు స్పష్టం చేశారు.

Jaishankar
జైశంకర్
author img

By

Published : Nov 16, 2020, 7:47 PM IST

కరోనా సంక్షోభం వేళ భవిష్యత్తుపై భారత్ విశ్వాసం కలిగించిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. హైదరాబాద్​ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన 'డెక్కన్​ డైలాగ్'​ ఆన్​లైన్​ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మహమ్మారికి ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకున్నా గణనీయమైన పురోగతి సాధించిందన్నారు.

"కొన్ని నెలల క్రితం టెస్టింగ్ కిట్లు, వెంటిలెటర్లు తదితరాలు దేశంలో ఉత్పత్తి కాకపోయినప్పటికీ... ప్రస్తుతం దేశ ఆవసరాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేయగలిగే స్థితికి చేరుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా అందరికి వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూసేందుకు సహాయపడతామని ఐక్యరాజ్యసమితికి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. కరోనా చికిత్సలో ఉపయోగపడే హైడ్రాక్సీక్లోరోక్విన్, ప్యారసిటమాల్ లాంటి ఔషధాల ఉత్పత్తిని పెంచి 150 దేశాలకు సరఫరా చేశాం. ఇందులో సగానికి పైగా దేశాలకు సొంత ఖర్చుతో అందించాం."

- జైశంకర్, విదేశాంగ మంత్రి

కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక కార్యకలాపాలపై ఆలోచన తీరు మారుతుందన్నారు జైశంకర్​. ఈ పరిస్థితిని భారత్ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఇదీ చూడండి: మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​కు కొవాగ్జిన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.