వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలురాయిని అధిగమించింది భారత్. ప్రపంచవ్యాప్తంగా.. అతితక్కువ కాలంలో అత్యధిక మందికి టీకా అందించిన తొలి దేశంగా నిలిచింది. టీకా కార్యక్రమం ప్రారంభమైన 24 రోజుల్లోనే.. 60లక్షల 35వేల 660మందికి(సోమవారం సాయంత్రం నాటికి) వ్యాక్సిన్ అందించింది భారత ప్రభుత్వం.
ఈ మార్కుకు చేరడానికి అమెరికాకు 26 రోజులు, బ్రిటన్కు 46 రోజుల సమయం పట్టింది.
దేశంలో మొత్తం 60,35,660 మంది టీకా లబ్ధిదారుల్లో 54,12,270 మంది ఆరోగ్య సిబ్బంది కాగా.. 6,23,390 మంది వివిధ విభాగాల్లో కరోనాపై ముందుండి పోరాడిన వారు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అజ్ఞాని తెలిపారు. ఒక్క సోమవారం రోజే 2,23,298 మందికి వ్యాక్సిన్ అందించినట్లు వివరించారు.
ఇదీ చదవండి : 'ఆ 12 రాష్ట్రాలు వ్యాక్సినేషన్లో స్పీడ్ పెంచాలి'