Income Tax Raid: శివసేన నేత, ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఛైర్మన్ యశ్వంత్ జాదవ్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఆయన నివాసంపై దాడులు జరిపారు.
యశ్వంత్‌పై భాజపా నేత కిరీట్ మనీలాండరింగ్, అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కిరీట్ గతంలో కూడా ఎన్సీపీ నేతలపై కూడా ఈ విధమైన ఆరోపణలు చేయగా.. ఎన్సీపీ నేతల ఇళ్లలో సోదాలు జరిపారు ఐటీ అధికారులు.
ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 13వేల కరోనా కేసులు.. 302 మరణాలు