మరో నాలుగు రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. చెన్నై నీలంకరైలోని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అల్లుడు శబరీశన్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన నివాసంతో పాటు పలు కార్యాలయాలు, స్థలాల్లోనూ తనిఖీలు నిర్వహించారు.
ఇటీవల డీఎంకే అధినేత స్టాలిన్ తిరువణ్నామలైలో ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈవీ వేలుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపైనా ఐటీ దాడులు జరిగాయి.
ఇదీ చదవండి : డీఎంకే ఎమ్మెల్యే ఇళ్లు, ఆఫీస్లపై ఐటీ దాడులు