ETV Bharat / bharat

తండ్రికి 11ఏళ్ల బాలిక బెదిరింపు.. రూ.కోటి డిమాండ్! - గాజియాబాద్

వాట్సాప్​ ద్వారా ఏకంగా తండ్రిని బెదిరించి రూ.కోటి డిమాండ్ చేసింది ఓ 11 ఏళ్ల బాలిక. ఎందుకంటే..

extortion
వాట్సాప్
author img

By

Published : Jul 31, 2021, 7:30 PM IST

తండ్రిని వాట్సాప్​ ద్వారా బెదిరించి ఏకంగా రూ.కోటి డిమాండ్​ చేసింది ఓ 11 ఏళ్ల బాలిక. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో జరిగింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..

శాలిమార్​ గార్డెన్​ ఏరియాకు చెందిన 11 ఏళ్ల బాలికను తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక.. తండ్రి ల్యాప్​టాప్​ నుంచే ఆయనకు సందేశం పంపింది. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్​ చేసింది. లేదంటే ఆయన కుమారుడు, కూతురిని చంపేస్తానని బెదిరించింది.

దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ సందేశం అతని ఇంట్లో నుంచే వచ్చిందని గుర్తించారు. దీంతో కంగుతిన్న ఫిర్యాదుదారుడు.. కూతురిని ప్రశ్నించారు. వారు తిట్టడం వల్ల మనస్తాపం చెందినందుకే ఈ పనిచేసినట్లు బాలిక అంగీకరించింది.

అయితే ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాకపోతే.. బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోమని తల్లిదండ్రులకు సూచించారు.

ఇదీ చూడండి: జీన్స్​ వేసుకుందని బాలికను చంపేసిన కుటుంబీకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.