ETV Bharat / bharat

ఆహారం ఇచ్చేందుకు వెళ్లి.. వైద్యురాలిపై అత్యాచారం! - ఒడిశా వార్తలు

ఒంటరిగా ఉన్న వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ దాబా ఓనర్​ కుమారుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

doctor raped by delivery boy
వైద్యురాలిపై అత్యాచారం
author img

By

Published : Jul 1, 2021, 10:02 PM IST

వైద్యుల దినోత్సవం రోజున మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉన్న ఓ వైద్యురాలిపై అత్యాచారం జరిగినట్లు సమాచారం. ఈ ఘటన ఒడిశాలోని ఆంగుల్​ జిల్లాలో జరిగింది.

ఏం జరిగిందంటే..

ఛెండిపడలోని ప్రభుత్వ క్వార్టర్స్​లో బాధిత వైద్యురాలు తన సోదరుడితో కలిసి నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి స్థానిక దాబాలో తింటున్న సోదరుడు ఆమె కోసం ఆహారం పంపించారు.

ఆ పార్శిల్​ను దాబా యజమాని కుమారుడు సుకంత బెహరా తీసుకెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో ఆమె ఇంటికి చేరుకున్నాడు. అనంతరం వైద్యురాలు ఒంటరిగా ఉందని తెలుసుకొని, ఆమెపై బలాత్కారం చేసినట్లు సమాచారం.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వైద్యురాలిని పరీక్షలకు పంపించారు.

ఇదీ చూడండి: సగం కాలిపోయి.. అర్ధనగ్నంగా బాలిక మృతదేహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.