మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఒక్క రోజే 63,294 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఒక్క రోజులో ఇంత మందికి కరోనా సోకడం ఇదే మొదటిసారి. కాగా మరో 349 మంది కొవిడ్‌కు బలయ్యారు. 34,008 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. కాగా ముంబయిలో ఒక్కరోజే 9,989 కరోనా కేసులు నమోదయ్యాయి. 58 మంది మృతి చెందారు.
దిల్లీలో
దిల్లీలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఒక్కరోజే 10,774 మందికి పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 7,25,197కి చేరింది. మరో 48 మంది మృతి చెందారు.
యూపీలో విజృంభణ
ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా 15,353 కేసులు వెలుగుచూశాయి. మరో 67 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఒక్కరోజే ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి.
కర్ణాటకలో..
కర్ణాటకలో కొవిడ్ పంజా విసురుతోంది. కొత్తగా 10,250 మంది వైరస్ బారిన పడగా.. 40 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 10,65,290కి చేరింది.
తమిళనాడులో
తమిళనాడులో 6,618 కరోనా కేసుల నమోదయ్యాయి. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
కేరళలో మరో 6,986 కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 11,54,010కు చేరింది. తాజాగా 22 మంది కరోనాతో మరణించారు.
రాష్ట్రం | తాజా కేసులు | తాజా మరణాలు |
మధ్యప్రదేశ్ | 5,939 | 24 |
గుజరాత్ | 5,469 | 54 |
పంజాబ్ | 3,116 | 59 |
హరియాణా | 3,440 | 16 |
రాజస్థాన్ | 5,105 | 10 |
ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో లాక్డౌన్- యూపీలో స్కూళ్లు బంద్