అగ్గిపెట్టెలో పట్టే చీరను చూశాం.. మరి అగ్గిపెట్టె సైజులో ఉండే మతగ్రంథం గురించి ఎప్పుడైనా విన్నారా? కేరళ తిరురక్కాడుకు చెందిన రషీద్ అలీ అనే వ్యక్తి వద్ద ఉన్న ఈ అరుదైన ఖురాన్‌ను వేలం వేయనున్నట్లు తెలిపాడు.
దుబాయ్ నుంచి కేరళకు..
2017లో యూఏఈలో నిర్వహించిన షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో ఈ చిన్న ఖురాన్ ఎడిషన్ విడుదల అయింది. అయితే పరిమితంగా 100 కాపీలను మాత్రమే నిర్వాహకులు ప్రచురించారు. ఆ సమయంలో యూఏఈలోనే ఉన్న రషీద్ అలీ ఈ అతిచిన్న ఖురాన్ కాపీని పొందగలిగినట్లు వివరించాడు. అయితే దీనిని కంటితో చదవడం కష్టమని తెలిపాడు.
ఖురాన్ వేలం వేయగా వచ్చిన నిధులను తిరురక్కాడ్ మసీదుర్ రహమాన్ సమాధి విస్తరణ కోసం ఖర్చుచేయనున్నట్లు తెలిపాడు. ఇదే కాకుండా రషీద్ వద్ద మరో అతిచిన్న ఖురాన్(అగ్గిపెట్టె పరిమాణంలో) కూడా ఉంది.
ఇవీ చదవండి: