కర్ణాటక బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తుపాకులు కలకలం సృష్టించాయి. టర్కీ నుంచి శుక్రవారం వచ్చిన ఓ అనుమానాస్పద పార్శిల్‌ను కస్టమ్స్ అధికారులు పరిశీలించారు. అందులో కొన్ని తుపాకులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమై దర్యాప్తు చేయగా అవి సెమీ ఆటోమెటిక్ డమ్మీ గన్లని తేలింది. ఈ తుపాకులను ఓ సినిమా షూటింగ్ కోసం టర్కీ నుంచి తెప్పించినట్లు తెలుసుకున్నారు.
![Guns at International Airport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bng-02-gun-av-ka10057_30072021120756_3007f_1627627076_291_3007newsroom_1627632135_752.jpg)
ఓ భారీ బడ్జెట్ సినిమా చిత్రీకరణ కోసం వాటిని విదేశాల నుంచి కన్నడ నిర్మాతలు ఆర్డర్ చేశారని అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ డీసీపీ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత వాటిని నిర్మాతలకు అందజేస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి: అంతర్జాతీయ విమానాలపై మరోసారి నిషేధం పొడిగింపు