ETV Bharat / bharat

హెడ్​ మాస్టర్​ మెడలో చెప్పుల దండ- గ్రామం మొత్తం..

సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు గ్రామస్థులు. ఏకంగా మెడలో చెప్పులు, బూట్ల దండలు వేసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది.

హెడ్మాస్టర్
హెడ్మాస్టర్
author img

By

Published : Aug 13, 2021, 9:57 PM IST

మెడలో చెప్పుల, బూట్ల దండతో ప్రధానోపాధ్యాయుడిని ఊరేగిస్తున్న గ్రామస్థులు

ఝార్ఖండ్​లోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న లేడీ టీచర్​తో ప్రధానోపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఆ హెడ్​ మాస్టర్​ మెడలో చెప్పులు, బూట్ల దండలు వేసి ఊరేగించారు.

ఇదీ జరిగింది..

పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా మనోహర్‌పుర్ పరిధిలోని బాచ్‌మగుతు ఉన్నత పాఠశాలలో రమేశ్​చంద్ర మహతో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే పాఠశాలలో పని చేస్తున్న ఓ మహిళా టీచర్​ను.. ఆమె నియామకం చట్టవిరుద్ధమని వేధించేవాడని గ్రామస్థులు తెలిపారు. శారీరకంగానూ వేధింపులు తప్పవని తనను బెదిరించేవాడని సదరు ఉపాధ్యాయురాలు ఆరోపించింది.

రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్..

2003లో ఓ ఉపాధ్యాయురాలిగా నియామకమైన ఆ మహిళకు 2005లో పదోన్నతి లభించింది. అయితే 2020లో ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా నియమితుడైన రమేశ్ చంద్ర.. తన ఉద్యోగ నియామకం చెల్లదంటూ వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. దీనిపై పాఠశాలలోనే అనేకసార్లు వాదనలు జరిగినట్లు తెలిపింది. అపాయింట్‌మెంట్ సర్టిఫికెట్ కూడా అతని వద్దే ఉంచుకొని రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వాపోయింది.

"నా నియామకం సరైనది కాదని రమేశ్​ చంద్ర మహతో పదేపదే అంటుండేవాడు. అంతేగాక బెదిరించేవాడు. చిత్రహింసలకు గురిచేసేవాడు. శారీరకంగా వేధించేవాడు. లైంగిక హింసను వ్యతిరేకించినందుకు గొడవ కూడా జరిగింది."

-బాధిత ఉపాధ్యాయురాలు

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధానోపాధ్యాయుడిపై పాఠశాల అధ్యక్షుడు సైతం తీవ్ర ఆరోపణలు చేశారు.

"రమేశ్​చంద్ర మహతో రాత్రిసమయాల్లో బాలికలను పాఠశాలకు తీసుకువస్తుంటారు. అడిగితే వారు తన బంధువులు అని చెప్పేవారు. అలా చేయొద్దని అడ్డుకుంటే ఇది పాఠశాల పని.. మీరు తలదూర్చొద్దని దురుసుగా ప్రవర్తించేవాడు. ఇలా చాలా సార్లు జరిగింది."

-సురేష్​చంద్ర దాస్, పాఠశాల అధ్యక్షుడు

అయితే తనపై వచ్చిన ఈ ఆరోపణలను రమేశ్​చంద్ర మహతో ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని.. విచారణలో నిజానిజాలు బయటపడతాయని తెలిపారు.

"ప్రాథమిక పాఠశాలలో నియామకమైన ఆ ఉపాధ్యాయురాలు హైస్కూల్​లో విధులు నిర్వర్తిస్తోంది. జీతం కూడా ఆ ర్యాంకులోనే అందుతోంది. ఆమెపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకున్నారు."

-రమేశ్​చంద్ర మహతో

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.