ETV Bharat / bharat

వీధి కుక్క వీరంగం.. అరగంటలో 26 మందిపై దాడి.. చివరకు - ఉత్తరాఖండ్​ న్యూస్​

Mad dog bites more than 25 people: ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్​లో ఓ వీధికుక్క స్వైరవిహారం చేసింది. అరగంట వ్యవధిలో 26 మందిపైన దాడి చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు కర్రలతో దాడి చేసి కుక్కను చంపేశారు.

Mad dog bites more than 25 people
Mad dog bites more than 25 people
author img

By

Published : Jun 22, 2022, 12:42 PM IST

Mad dog bites more than 25 people: ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో ఓ వీధికుక్క వీరంగం సృష్టించింది. అరగంట వ్యవధిలోనే 26 మందికి పైగా జనాలపై దాడి చేసింది. హరి కీ పైడి సమీపంలోని బిర్లా ఘాట్​ ప్రాంతంలో ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో అనేక మందికి కాట్లు పడగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆగ్రహానికి గురైన ప్రజలు కర్రలతో కొట్టి కుక్కను చంపేశారు.

"దర్శనం అనంతరం విశ్రాంతి కోసం రోడ్డు పక్కన కూర్చున్నాను. ఇంతలోనే ఓ కుక్క వచ్చి నాపై దాడి చేసింది. అంతకుముందే చాలా మందిని కరిచి వచ్చింది. అయినా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు"

-ప్రవీన్​ కుమార్​ గోయల్​, యాత్రికుడు

ఆస్పత్రిలో 26 మంది చేరారని.. వారందరికీ రేబీస్​ ఇంజెక్షన్లు ఇచ్చామని వైద్యులు తెలిపారు. వీరిలో స్థానికులతో పాటు యాత్రికులు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. ఇలాంటి దారుణాలు జరుగుతున్నా మున్సిపల్​ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరిద్వార్​ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రం ఈ ఘటనతో అప్రతిష్ఠ పాలవుతుందని స్థానికులు అందోళన వ్యక్తం చేస్తునారు. ఆవులు సైతం రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నాయని.. అనేక మంది చనిపోతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు.

ఇదీ చదవండి: మహిళపై సజీవ దహనానికి విఫలయత్నం.. నాలుక కోయాలని ప్రయత్నించి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.