ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. లోయ వైపు దూసుకెళ్తుంది. ఇక పడిపోతుందేమోనని ఆందోళన నెలకొన్న వేళ... ఒక్కొక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి, ప్రాణాలతో బయటపడతారు. ఇలాంటి సన్నివేశాలు పాత సినిమాల్లోని క్లైమాక్స్‌లో మనం చూశాం. అయితే.. హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాలో నిజంగానే ఈ తరహా ఘటన జరిగింది. ప్రైవేట్ బస్సుకు కొద్దిలో పెను ప్రమాదం తప్పింది.
ఏం జరింగిందంటే..?
బోహ్రాద్ ఖడ్ సమీపంలో షిల్లా గ్రామం వద్ద జాతీయ రహదారి 707పై ప్రైవేట్ బస్సు అదుపు తప్పి భారీ లోయ వైపు దూసుకెళ్లింది. ముందు చక్రాలతో పాటు ముప్పావు వంతు బస్సు లోయ వైపు ఒరిగిపోగా డ్రైవర్ అత్యంత అప్రమత్తతతో వ్యవహరించి నియంత్రించాడు.
బస్సులోని 22 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చేవరకు డ్రైవర్ ఎంతో నేర్పుతో బస్సు లోయలో పడకుండా నిలువరించాడు. చివరకు ప్రయాణికుల సాయంతో డ్రైవర్ సైతం సురక్షితంగా బయటపడటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి: ఎత్తైన పర్వతం ఎక్కి అసోం వాసి రికార్డు