ETV Bharat / bharat

పోలీసుల విచారణను తట్టుకోలేక స్టేషన్​ ముందే.. - చెన్నై యువకుడు బలవన్మరణం

పోలీసులు పదేపదే విచారణకు పిలుస్తున్నారని మనస్తాపం చెందిన యువకుడు ఆ పోలీస్​ స్టేషన్​ ముందే బలవన్మరణానికి పాల్పడ్డాడు. అటుగా వెళ్తున్న బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు చెన్నైలో జరిగింది.

in a gory incident, a youth summoned for interrogation by Chennai Police ended his life
పోలీసుల విచారణను తట్టుకోలేక....బస్సు కింద పడి
author img

By

Published : Dec 19, 2020, 10:26 AM IST

Updated : Dec 19, 2020, 3:02 PM IST

ఓ కేసులో భాగంగా పోలీసులు పదే పదే విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేస్తుంటే మనస్తాపం చెందాడు ఆ యువకుడు. పోలీస్​ స్టేషన్​ ఎదుటే బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం జరిగిందీ ఘటన.

పోలీసుల విచారణను తట్టుకోలేక....బస్సు కింద పడి

ఏం జరిగింది..

తమిళనాడులో చెన్నై శోలింగ్​నల్లూర్​లోని లాల్​ బహదూర్​ శాస్త్రి కాలనీకి చెందిన సతీశ్​ కుమార్ తనతో​ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ.. స్థానికంగా ఉండే ఓ యువతి సెమ్మనచెరి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తులో భాగంగా పోలీసులు.. సతీశ్​ను పలుమార్లు స్టేషన్​కు పిలిపించారు. విచారణను తట్టుకోలేకపోయిన సతీశ్..​ పోలీస్​ స్టేషన్​ బయటకు వచ్చి అటుగా వెళ్తున్న బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు.. మృతదేహాన్ని పంచనామాకు తరలించారు.

ఇదీ జరిగింది : పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. 3 నెలల్లో 5188

Last Updated : Dec 19, 2020, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.