ETV Bharat / bharat

Imprisonment To Retired Officers : 20ఏళ్ల క్రితం​ రూ.170 లంచం!.. ముగ్గురు రిటైర్డ్​ ఉద్యోగులకు 4 ఏళ్లు జైలు శిక్ష

Imprisonment To Retired Officers : 20 ఏళ్ల క్రితం చేసిన తప్పిదం కారణంగా ముగ్గురు రిటైర్డ్​ ఉద్యోగులకు జైలు శిక్ష విధించింది కోర్టు. రూ.16వేల చొప్పున జరిమానా కూడా విధించింది. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. అసలు వారు చేసిన ఆ తప్పేంటో తెలుసా?

Imprisonment To Retired Officers
Imprisonment To Retired Officers
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 7:10 PM IST

Imprisonment To Retired Officers : విధులకు గైర్హాజరైన ఓ హోంగార్డు నుంచి రెండు రోజులకు గాను.. రూ.170 లంచంగా తీసుకున్నారన్న కేసులో ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్​ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో పదవీ విరమణ పొందిన ముగ్గురు వ్యక్తులను దోషులుగా తేల్చింది. వారికి నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ.16వేలు జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే?

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పురన్​పుర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో సూరజ్​ అనే వ్యక్తి హోంగార్డుగా 2003 సెప్టెంబరు 10వ తేదీన విధుల్లోకి చేరారు. కానీ ఆ రోజు విధులకు హాజరు కాలేదు. ఆ విషయాన్ని మున్షీ రాజారామ్​.. హాజరు రిజిస్టర్​లో నమోదు చేశారు. సెప్టెంబరు 13వ తేదీన సూరజ్​ తిరిగి విధుల్లోకి చేరారు. ఆ విషయాన్ని కూడా మున్సీ రాజారామ్​ రిజిస్టర్​లో రాశారు.

మస్టర్​ రోల్​ సిద్ధం చేసే సమయంలో..
అయితే ప్లాటూన్​ కమాండర్​ చున్నీలాల్​.. అదే నెల(2003 సెప్టెంబరు)కు సంబంధించిన మస్టర్​ రోల్​ను సిద్ధం చేశారు. అందులో సెప్టెంబరు 11వ తేదీన మాత్రమే హోంగార్డు సూరజ్​ విధులకు గైర్హాజరైనట్లు చూపించారు. సెప్టెంబరు 10, 12 తేదీల్లో విధుల్లో ఉన్నట్లు చూపించారు. అనంతరం మస్టర్​ రోల్​ను కంపెనీ కమాండర్​ అబ్దుల్​ నఫీస్​కు పంపించారు.

రెండు రోజులకు రూ.170 లంచం!
చున్నీలాల్​ సిద్ధం చేసిన మస్టర్​ రోల్​ను పరిశీలించిన కంపెనీ కమాండర్​ అబ్దుల్​ నఫీస్​.. దానిపై సంతకం చేసి పురన్​పుర్​​ బ్లాక్​ ఆఫీసర్​ రోషన్ లాల్​కు పంపారు. అయితే అబ్దుల్​ నఫీస్​.. రెండు రోజులకు గాను సూరజ్​ నుంచి రూ.170 లంచంగా అందుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై పురన్​పుర్​ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది.

హోంగార్డు మృతి చెందడం వల్ల..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేర పరిశోధన విభాగం (CBCID).. ఈ కేసును దర్యాప్తు చేసింది. పీలీభీత్​ కోర్టులో పెండింగ్​లో ఉన్న ఈ కేసులో జడ్జి అమిత్​ కుమార్​ యాదవ్​.. శనివారం తీర్పు ఇచ్చారు. సూరజ్​, చున్నీలాల్​, అబ్దుల్​ నఫీస్​, రోషన్​ లాన్​ను దోషులుగా నిర్ధరించి జైలు శిక్షను ఖరారు చేశారు. హోంగార్డు సూరజ్​ మృతి చెందడం వల్ల మిగిలిన ముగ్గురికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. ఒక్కొక్కరు రూ.16వేలు చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.