ఆరోగ్య కార్యకర్తలతో పాటు దేశంలోని ప్రజలందరికీ కరోనా టీకాను ఉచితంగా అందించాలని భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. హానికరమైన రోగాల నుంచి ప్రజలను రక్షించేందుకు వ్యాక్సినేషన్ కీలకమని పేర్కొంది. టీకా కోసం నమోదు చేసుకునే ఆన్లైన్ పోర్టల్‌ను ప్రజలు సులభతరంగా ఉపయోగించేలా తీర్చి దిద్దాలని సోమవారం ప్రకటన ద్వారా తెలిపింది.
వ్యాక్సినేషన్ రెండో దశలో భాగంగా తొలి డోసు తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపింది ఐఎంఏ. మాస్ వ్యాక్సినేషన్లో పాల్గొన్న ప్రధానికి, కేంద్రానికి తాము మద్దతుగా ఉంటామని పేర్కొంది.