ETV Bharat / bharat

ఒక్కరోజులో 6 వేల సంస్థలకు విదేశీ విరాళాలు కట్​! - ఐఐటీ దిల్లీ

FCRA registration expired: దేశంలోని ఆరు వేల సంస్థల ఎఫ్ఆర్​సీఏ లైసెన్సు ముగిసింది. దిల్లీ ఐఐటీ, జామియా మిలియా ఇస్లామియా విద్యాసంస్థలతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నెహ్రూ మ్యూజియం లైసెన్సు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు పొందేందుకు ఎఫ్ఆర్​సీఏ లైసెన్సు వీలు కల్పిస్తోంది.

FRCA JAMIA MILLIA
FRCA JAMIA MILLIA
author img

By

Published : Jan 1, 2022, 5:28 PM IST

Updated : Jan 1, 2022, 6:54 PM IST

IIT Delhi FCRA registration: ఐఐటీ దిల్లీ, జామియా మిలియా ఇస్లామియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నెహ్రూ మెమొరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సహా సుమారు ఆరువేల సంస్థల ఎఫ్ఆర్​సీఏ లైసెన్స్‌ గడువు ముగిసింది. ఎఫ్ఆర్​సీఏ లైసెన్స్‌ పునరుద్ధరణ కోసం ఆయా సంస్థలు దరఖాస్తు చేసుకోకపోవటం వల్లనో లేదా కేంద్ర హోంశాఖ వాటి దరఖాస్తును తిరస్కరించిన కారణంగానో.. ఆరువేల సంస్థల లైసెన్స్ గడువు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు.

FCRA registrations expired

స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు పొందేందుకు ఎఫ్ఆర్​సీఏ లైసెన్స్ తప్పనిసరి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్ఆర్​సీఏ) అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాల్ బహదూర్ శాస్త్రి మెమొరియల్ ఫౌండేషన్, ఆక్స్‌ఫామ్ ఇండియా సహా ఆరు వేల సంస్థల లైసెన్స్ ముగిసింది.

శుక్రవారం వరకూ దేశవ్యాప్తంగా ఎఫ్ఆర్​సీఏ లైసెన్స్ ఉన్న స్వచ్ఛంద సంస్థల సంఖ్య 22 వేల 762గా ఉండగా ఇవాళ ఆ సంఖ్య 16వేల 829కి దిగివచ్చింది. 2020 సెప్టెంబర్ 30 నుంచి 2021 డిసెంబర్ 31 మధ్య ఎఫ్​సీఆర్ఏ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం 12,989 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇందులో 179 సంస్థల దరఖాస్తులను తిరస్కరించినట్లు వెల్లడించింది. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొంది.

ఇదీ చదవండి: వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

Last Updated : Jan 1, 2022, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.