ETV Bharat / bharat

అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదులు తీసుకోరు - చోద్యం చూస్తారంతే! - sand mining in ap

Illegal Soil Excavation: అక్కడ ఒకేసారి దాదాపు 20 టిప్పర్లు మట్టి తరలిస్తున్నాయి. జేసీబీలు తవ్వకాలు సాగిస్తున్నాయి. గ్రామస్థులు వాటిని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే ఒక ఏఏస్ఐ, ఒక కానిస్టేబుల్ వచ్చారు. అంతే ఎక్కడివక్కడే మట్టిని అన్‌లోడు చేసి తుర్రుమన్నాయి. ఇదీ విజయవాడ గ్రామీణ మండలం, జి.కొండూరు మండలం, గన్నవరం మండలంలో జరుగుతున్న మట్టి మాఫియా తంతు.

Illegal_Soil_Excavation
Illegal_Soil_Excavation
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 6:49 AM IST

Updated : Jan 12, 2024, 8:15 AM IST

అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదులు తీసుకోరు - చోద్యం చూస్తారంతే!

Illegal Soil Excavation : విజయవాడ, గన్నవరం, జి.కొండూరు మండలాల పరిధిలో ఇప్పటికీ అనధికారికంగా పది క్వారీలు నడుస్తున్నాయి. దాదాపు 200 ఎకరాల్లో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. పగలే కాదు రాత్రిపూట కూడా లైట్ల వెలుతురులో తవ్వకాలు చేస్తున్నారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులకు సమాచారం ఇస్తున్నారు. వారు ఖాతరు చేయడం లేదు. అక్రమ క్వారీయింగ్ వెనుక నేతలే ఉండటంతో ఎవరూ అడ్డుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ భూములు, ఎస్సైన్‌మెంట్‌ భూములు, కొండ పోరంబోకు భూముల్లో ఇష్టానుసారం తవ్వకాలు జరుపుతున్నారు.

ప్రశ్నిస్తే దౌర్జన్యమే : కొత్తూరు తాడేపల్లికి చెందిన రైతు వేముల కొండ నాగరాజు తనకున్న 5 ఎకరాల్లో పోలవరం కాలువకు భూసేకరణకు పోగా మిగిలిన ఎకరంలో సేద్యం చేస్తున్నారు. దాని పక్కనే ఉన్న ఎస్సైన్‌మెంట్ భూముల్లో గత కొన్ని రోజులుగా అక్రమార్కులు మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. అయినా మనకెందుకులే అని మౌనంగా ఉన్నారు. గురువారం ఉదయం నుంచి తన పొలాన్ని ఆనుకుని 10 మీటర్ల వరకు తవ్వకాలు జరుపుతున్నారు. తన పొలానికి ఇబ్బందులు ఎదరవుతాయని ప్రశ్నించారు.

కేశవరంలో గ్రావెల్‌ రగడ-చల్లారని ఎర్రమట్టి తవ్వకాల చిచ్చు

దీంతో అక్రమార్కులు నాగరాజుపై దౌర్జన్యానికి దిగారు. విషయాన్ని గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మెండెం జమలయ్యకు వివరించి సాయం కోరారు. గ్రామస్థులు కొంతమంది కలిసి అక్రమ తవ్వకాలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. డయల్ 100కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వాహనంలో ఏఏస్ఐ స్వామి. మరో కానిస్టేబుల్ వచ్చారు. లారీలను నిలుపుదల చేసిన గ్రామస్థులను అక్రమ తవ్వకందారులు బెదిరించి లారీలను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు రాకను గమనించి వారి ముందే మట్టిని ఎక్కడికక్కడ పోసి లారీలను తిప్పుకుని వెళ్లారు. ఆపాలని చేసినా ప్రయత్నం ఫలించలేదు. ఏం చేసేది లేక గ్రామస్థులు, పోలీసులు తిరుగుముఖం పట్టారు.

'ఒక్క ఛాన్స్' అని అడిగింది మట్టి దొంగలను కాపాడేందుకేనా? - ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్​పై దేవినేని ఫైర్

అవినీతితో కళ్లకు గంతలు : కొత్తూరు తాడేపల్లిలో అక్రమ క్వారీలపై ఫిర్యాదు చేస్తున్న తనను హత్య చేస్తామని బెదిరిస్తున్నారని టీడీపీ కార్యకర్త మెండెం జమలయ్య భయాందోళన చెందుతున్నారు. తాను అధికారులకు ఫిర్యాదు చేస్తున్నానని తనపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. అధికారులకే రక్షణ లేకుండా పోయిందని క్వారీల వరకు అధికారులెవరూ రావడంలేదని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. తనకు రక్షణ కల్పించాలని సీపీకి విజ్ఞాపనపత్రం అందజేయనున్నట్లు చెప్పారు. తమ గ్రామాల రోడ్లు దారుణంగా ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ అవినీతితో కళ్లకు గంతలు కట్టుకున్నారని ధ్వజమెత్తారు.

గనుల శాఖ విజిలెన్స్ అధికారికి సమాచారం ఇస్తే, రెవెన్యూ అధికారులకు ఇవ్వాలని, రవెన్యూ అధికారులకు చెబితే గనుల శాఖకు చెప్పాలంటూ ముప్పుతిప్పలు పెట్టారని గ్రామస్థులు వాపోతున్నారు.

Illegal mining: తురకొలకొండపై కన్నేశారు తవ్వేశారు.. బరితెగించిన మైనింగ్ మాయగాళ్లు

Last Updated : Jan 12, 2024, 8:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.