ETV Bharat / bharat

కల్తీ రక్తంతో అక్రమ దందా- డాక్టర్ అరెస్ట్

కల్తీ రక్తాన్ని సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను ఉత్తర్​ప్రదేశ్​ స్పెషల్​ టాస్క్​ఫోర్స్ అరెస్ట్​ చేసింది. ఇందులో ఓ వైద్యుడు ఉన్నట్లు తెలిపింది. నిందితులిద్దరూ.. హరియాణా, పంజాబ్​, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలకు కల్తీ రక్తాన్ని సరఫరా చేస్తున్నట్లు విచారణ తేలిందని వెల్లడించింది.

Illegal blood smuggling racket
కల్తీ రక్తంతో అక్రమ దందా
author img

By

Published : Sep 17, 2021, 1:49 PM IST

కొవిడ్​ కాలంలో ఎందరో వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిస్వార్థంగా విధులు నిర్వహిస్తుంటే.. కొందరు మాత్రం ఆ వృత్తికే కళంకం తెచ్చే పనులు చేస్తున్నారు. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ వైద్యుడు ఇటువంటి దారుణానికి పాల్పడి అధికారులకు చిక్కాడు. కల్తీ రక్తం సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైద్యుడు సహా మరో వ్యక్తిని రాష్ట్ర స్పెషల్​ టాస్క్​ఫోర్స్(ఎస్​టీఎఫ్​)​ అధికారులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి 100 యూనిట్ల రక్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో ఒకరైన డాక్టర్​ అభయ్​ సింగ్​ వద్ద 45 యూనిట్ల రక్తాన్ని అధికారులు గుర్తించారు. సింగ్​ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను సైఫాయి వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్​గా విధులు నిర్వహిస్తున్నట్లు ఎస్​టీఎఫ్​కు తెలిపాడు. ​వివిధ ప్రాంతాల నుంచి రక్తాన్ని సేకరించి.. సరఫరా చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఇంట్లో ఉన్నాయని తెలిపాడు. అయితే సింగ్​ నివాసానికి వెళ్లిన అధికారులు.. ఆ పత్రాలను స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. అవి నకిలీవని తేలింది.

మరో నిందితుడు అభిషేక్​ పాఠక్​ ఇంట్లో 55 యూనిట్ల నకిలీ రక్తాన్ని స్వాధీనం చేసుకున్న ఎస్​టీఎఫ్ అధికారులు.. అతడ్ని ప్రశ్నించారు. నకిలీ పత్రాలతోనే.. పలు ఆస్పత్రులకు రక్తాన్ని సరఫరా చేస్తున్నట్లు అతడు అంగీకరించాడు. రక్తం సరఫరా చేయడానికి లఖ్​నవూ సహా పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఏజెంట్లు ఉన్నట్లు పేర్కొన్నాడు.

రాజస్థాన్, పంజాబ్​, హరియాణా సహా పలు రాష్ట్రాలకు కల్తీ రక్తాన్ని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లఖ్​నవూ సహా సమీపంలోని జిల్లాల్లోని పలు ఆసుపత్రులు, బ్లడ్​ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుని రక్తాన్ని విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పాకిస్థాన్​కు సైనిక సమాచారం లీక్​!.. గ్యాస్​ ఏజెన్సీ ఓనర్​ అరెస్ట్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.