భారత్లో కొవిడ్ మహమ్మారి మరింత విజృంభించనుందని.. మే 14 నుంచి 18 తేదీల మధ్య క్రియాశీల కేసులు 38 నుంచి 48లక్షల గరిష్ఠానికి చేరతాయని ఐఐటీ నిపుణులు తెలిపారు. మే 4 నుంచి 8 తేదీల్లో రోజువారీ కొత్త కేసులు 4.4 లక్షల గరిష్ఠానికి చేరనున్నట్లు పేర్కొన్నారు. గణిత నమూనా ప్రకారం.. గతంలో ప్రకటించిన కేసుల అంచనాలను సవరించారు. కరోనా బారినపడేందుకు అవకాశం ఉన్న, పరీక్షించని, పరీక్షించిన, తొలగించిన-సూత్రం ప్రకారం క్రియాశీల కేసులు.. మే నెల మధ్యకాలానికి మరో 10లక్షలు పెరగనున్నట్లు ఐఐటీ కాన్పూర్, హైదరాబాద్కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదీ చదవండి: 'ఇంట్లో ఉన్నా మాస్క్ పెట్టుకోవాల్సిన సమయం'
తాజా అంచనాల ప్రకారం.. కేసుల సంఖ్యను, కాలాన్ని కూడా సవరించారు నిపుణులు. గతవారం ప్రకటించిన అంచనాల ప్రకారం.. మే 11 నుంచి 15 తేదీల మధ్య క్రియాశీల కేసులు 33 నుంచి 35 లక్షలకు చేరతాయన్నారు. మే నెలాఖరుకల్లా కేసులు భారీగా తగ్గుతాయని పేర్కొన్నారు.
ఏప్రిల్ 15నాటికి క్రియాశీల కేసులు గరిష్ఠ స్థాయికి చేరుతాయని ఈ నెలారంభంలో అంచనాలను ప్రకటించారు. కానీ, అలా జరగలేదు. అయితే.. ఈసారి కనిష్ఠ, గరిష్ఠ కేసులను అంచనా వేసినట్లు ఐఐటీ కాన్పూర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆచార్యుడు మణీందర్ అగర్వాల్ తెలిపారు.
ఇదీ చదవండి: 'ఆక్సిజన్ వినియోగంలో ఆ రంగాలకు మినహాయింపు'