ETV Bharat / bharat

IIT Hyderabad Student Suicide : ఒత్తిడి తట్టుకోలేకే చనిపోతున్నా.. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య.. 20 రోజుల్లో రెండోది - ఐఐటీహైదరాబాద్​లో ఆత్మహత్య చేసుకున్నఒడిశావిద్యార్థి

IIT Hyderabad Student Suicide: ఇటీవల ఐఐటీ హైదరాబాద్​లో చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరవై రోజుల కింద మెకానికల్ సెకండియర్ విద్యార్థి విషాద ఘటన మరవకముందే తాజాగా ఫస్టియర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పదిరోజుల క్రితమే కళాశాలలో చేరిన తమ కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

IIT Hyderabad Student Commits Suicide
IIT Hyderabad
author img

By

Published : Aug 8, 2023, 1:21 PM IST

Updated : Aug 8, 2023, 1:43 PM IST

IIT Hyderabad Student Suicide : జీవితంలో రాణించి ఉన్నత స్థానంలో ఉండాలనే ఆశయంతో కొందరు విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలలో మంచి ప్రతిభ కనబరిచి ఉన్నత విద్యను అభ్యసిస్తూ.. తాము ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నారు. ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు ఎదుర్కొని తీరా చివరి మెట్టుపై బోల్తా పడుతున్నారు. \

ఏళ్ల తరబడి పడిన కష్టాన్ని మరిచి.. అలసిపోయామంటూ మనోవేదనకు గురవుతున్నారు. తల్లిదండ్రులు, జీవితాశయం గురించి ఆలోచించకుండా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయంతో అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చుతూ కానరానిలోకానికి పయనమవుతున్నారు. తాజాగా హైదరాబాద్ ఐఐటీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో కష్టపడి ఐఐటీలో సీటు సాధించిన ఓ విద్యార్థి చివరకు మానసిక ఒత్తిడితో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Young man suicides in Patancheru : బతకాలనిలేదని.. సెల్ఫీవీడియో సోదరికి పంపి.. యువకుడి ఆత్మహత్య

Mental Stress Killed IIT Hyderabad Student : ఇటీవల ఐఐటీ హైదరాబాద్​(IIT Hyderabad)లో చోటుచేసుకుంటున్న విద్యార్థి ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. గత నెల 17న మెకానికల్ సెకండియర్ చదువుతున్న నల్గొండ జిల్లాకు చెందిన కార్తీక్ విషాద ఘటన మరవకముందే తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడడం గమనార్హం. ఇరవై రోజుల వ్యవధిలో ఐఐటీ హైదరాబాద్​లో ఇద్దరు విద్యార్థులు(Students Suicide in IIT Hyderabad) ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి. సంగారెడ్డి శివారులోని కందిలో గల ఐఐటీ హైదరాబాద్‌లో సోమవారం మానసిక ఒత్తిడితో మమైతనాయక్‌(21) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

IIT Hyderabad Student Suicide : ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి 'అదృశ్యం.. విషాదాంతం'

సంగారెడ్డి గ్రామీణ ఎస్సై రాజేశ్‌నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం : ఒడిశాకు చెందిన మమైతనాయక్ పోటీ పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచి ఐఐటీ హైదరాబాద్​లో సీటు సంపాదించాడు. జులై 26న ఎంటెక్ ప్రథమ సంవత్సరంలో చేరారు. కళాశాలలో జాయిన్ అయి 10 రోజులు అయిందో లేదో సోమవారం తన గదిలోనే ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. ఎంతకీ మమైతనాయక్ గది డోర్​ తీయకపోవడంతో తోటి విద్యార్థులకు అనుమానం వచ్చి చూశారు. వెంటనే వారు రాత్రి 10 గంటలకు పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అనంతరం విద్యార్తిని బలవన్మరణానికి కారణాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో పోలీసులు మమైతనాయక్​ గదిలో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్​లో ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. మానసిక ఒత్తిడి(Mental Stress) గురవుతున్నాను’ అని రాసి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మానసిక ఒత్తిడితోనే ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడా ? మరేదైనా కారణంతో బలవన్మరణానికి పాల్పడ్డాడా? అనే కోణంలోను పోలీసులు విచారణ ప్రారంభించారు.

Young Man Unexpected Death in Hyderabad : ప్రియురాలికి పిజ్జా ఇవ్వడానికి వెళ్లిన ప్రియుడు.. ఇంతలో తండ్రి ఎంట్రీ.. చివరికి!

Young Man Suicide in Warangal : 6 నెలల కష్టం 'ఆన్‌లైన్‌ గేమ్‌' పాలు.. ఆపై..

Last Updated : Aug 8, 2023, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.