ETV Bharat / bharat

'గంగూలీని వంచించారు.. పరిహారంగా ఐసీసీకి నామినేట్ చేయాలి' - బీబీసీఐ సౌరవ్​ గంగూలీ మమతా న్యూస్​

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మద్దతుగా బంగాల్ సీఎం మమతా కీలక వ్యాఖ్యలు చేశారు. గంగూలీ తమ రాష్ట్రానికే కాక దేశం మొత్తానికి గర్వకారణమని అన్నారు. దాదాను ఐసీసీకి నామినేట్ చేయాలని డిమాండ్ చేశారు.

sourav mamatas jibe at bcci bosses
సౌరవ్ గంగూలీ
author img

By

Published : Oct 17, 2022, 4:42 PM IST

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీకి ఉద్వాసన ఖరారు అయిన వేళ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. సౌరవ్‌ గంగూలీని బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో వంచించారని తీవ్ర ఆరోపణలు చేశారు. గంగూలీని ఐసీసీకి పంపాలని ప్రధాని మోదీకి మమత విజ్ఞప్తి చేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీని అన్యాయంగా తప్పించారన్న ఆమె.. ఆ వార్తలు తనను ఎంతో బాధించాయని అన్నారు.

'గంగూలీ చాలా ప్రముఖ వ్యక్తి. భారత కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. అడ్మినిస్ట్రేటర్​గా తనను తాను నిరూపించుకున్నారు. భారత్​కు చాలా ఇచ్చిన గంగూలీ.. బంగాల్‌కే కాక.. దేశానికి గర్వకారణం. అలాంటి వ్యక్తిని బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల నుంచి ఎందుకు తప్పించారు? అమిత్ షా కుమారుడు జైషా రెండోసారి బీసీసీఐ కార్యదర్శి కాబోతున్నప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? బీసీసీఐ పదవి నుంచి తప్పిస్తున్నందుకు పరిహారంగా ఐసీసీకి గంగూలీని నామినేట్ చేయాలి. ఐసీసీ ఛైర్మన్ పదవికి పోటీ పడేలా చూడాలని ప్రధానిని కోరతా.'

-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గంగూలీ.. దిల్లీలోని అనేకమంది పెద్దలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయితే రెండోసారి బీసీసీఐ పగ్గాలు గంగూలీకి అప్పగించేందుకు వారు సిద్ధంగా లేనట్లు సమాచారం. ఐపీఎల్ ఛైర్మన్ పదవిని ఆఫర్ చేయగా.. దాన్ని దాదా సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవిలోనే కొనసాగేందుకు ఆసక్తి చూపించారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ ఛైర్మన్ పదవిని అరుణ్ ధుమాల్​కు అప్పగించాలని భావిస్తున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నికవ్వనున్నారని తెలుస్తోంది. ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జైషా.. ఆ పదవిలో కొనసాగడం సహా ఐసీసీలో భారత ప్రతినిధిగా వ్యవహరించనున్నారు.

ఈ పరిణామాల మధ్య గంగూలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టడానికి ముందు క్యాబ్ ప్రెసిడెంట్​గా ఉన్న ఆయన.. మరోసారి ఆ ఎన్నికలకు పోటీ పడనున్నారు. అక్టోబర్ 22న నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.