ETV Bharat / bharat

రూ.20 కోసం గొడవ- ఇడ్లీ వ్యాపారి మృతి - రూ.20కోసం ఇడ్లీ వ్యాపారి హత్య

20 రూపాయల కోసం ఇడ్లీ వ్యాపారితో గొడవపడిన దుండగులు.. పట్టపగలు అందరూ చూస్తుండగానే అతడ్ని చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

Idli seller killed by three customers after argument over Rs 20
రూ.20 కోసం ఇడ్లీ వ్యాపారి దారుణ హత్య!
author img

By

Published : Feb 6, 2021, 1:00 PM IST

మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. ఠాణెలో ఓ టిఫిన్​ సెంటర్​ యజమానితో రూ.20 కోసం వాగ్వాదానికి దిగిన ముగ్గురు వ్యక్తులు.. అందరూ చూస్తుండగానే అతడిపై దాడి చేసి చంపేశారు.

ఏం జరిగిందంటే.?

ఠాణె జిల్లాలోని మీరా రోడ్​ సమీపంలో వీరేంద్ర యాదవ్(26)​ ఇడ్లీ సెంటర్​ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఆ హోటల్​కు ముగ్గురు వ్యక్తులు వచ్చారు. తమకు బాకీ ఉన్న రూ.20 ఇవ్వాలని వీరేంద్రతో వాగ్వాదానికి దిగారు. ఆ గొడవ కాస్తా పెద్దదైంది. ఆ ముగ్గురూ వీరేంద్రను తోసేశారు. కిందపడిన అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

స్థానికులు వీరేంద్రను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ అతడు మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతరం.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపినట్టు చెప్పారు.

ఈ పూర్తి వ్యవహారంపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి: 19 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.